హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆక్వా రైతులను ప్రభుత్వం మోసం చేస్తోంది'

W.G: కూటమి ప్రభుత్వంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని YCP జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. గురువారం పాలకొల్లులో విలేకరులతో మాట్లాడారు. గత YCP ప్రభుత్వంలో అప్సడా చట్టాన్ని తెచ్చి సీడ్, ఫీడ్ ధరలను నియంత్రించామని చెప్పారు. రూ.1.50కే కరెంట్ ఇచ్చి ఆదుకున్నామని, కూటమి సర్కార్ పవర్ ఫ్యాక్టర్ నిబంధనలతో మోసం చేస్తోందని మండిపడ్డారు.