WGL: నెక్కొండ మండల కేంద్రంలో గురువారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ చీరకొంగు వెనుక టైర్‌లో ఇరుక్కోవడంతో వాహనం అదుపుతప్పింది. వాహనదారుడు వెంటనే బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. మహిళలు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో చీరకొంగు టైర్‌కు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచించారు.
తెలంగాణ
చీరకొంగు టైర్‌లో ఇరుక్కొని గాయాలు..


