హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్ల రిబ్బన్లతో మున్సిపల్ కార్మికుల నిరసన..

KMM: తొమ్మిది నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నామని కల్లూరు మున్సిపల్ కార్మికులు నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరై గురువారం నిరసన చేపట్టారు. ఈనెల 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేము రాంబాబు తెలిపారు. కుటుంబపోషణ భారంగా మారిందని, పాలకులు వెంటనే స్పందించి జీతాలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు.