హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికల వసతిగృహంలో సౌకర్యాలపై ఆరా

NZB: మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల బాలికల వసతిగృహాన్ని ఎంఈఓ రాములు గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతి, భోజనం, విద్య, ఆరోగ్య సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. భోజనం నాణ్యత, వంటగది పరిశుభ్రతను పరిశీలించారు. వసతిగృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.