హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాకాలంలో పారిశుధ్యంపై మేయర్ సమీక్ష

KNR: వర్షాకాలం నేపథ్యంలో కరీంనగర్‌లో పారిశుధ్యం, దోమల నియంత్రణ, నీటి నిల్వలు, సీజనల్ వ్యాధుల నివారణపై మేయర్ కొలగాని శ్రీనివాస్ అధికారులతో సమీక్షించారు. నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి నోటీసులు జారీ చేయాలని, డ్రైనేజీలు, నాలాలు, కల్వర్టుల్లో పూడిక తొలగించాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల యాంటీ లార్వా మందులు, ఫాగింగ్ చేపట్టాలని సూచించారు.