VZM: రానున్న వినాయక చవితి సందర్భంగా ఎస్.కోట మండలంలో ఉన్న డీజే యాజమానులతో సీఐ వి.నారాయణమూర్తి గురువారం సమావేశం నిర్వహించారు. వినాయక చవితి సంబరాలలో డీజే సౌండ్స్ పరిమితి మించి ఉపయోగిస్తే కేసులు తప్పవన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా చూడాలని కోరారు. డీజే సౌండ్స్ వల్ల ఏమైనా ప్రమాదం జరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
డీజే యాజమానులతో సీఐ సమావేశం


