హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మరిన్ని గృహాలు మంజూరు చేయాలి'

పార్వతీపురం నియోజకవర్గానికి మరిన్ని గృహాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. విజయవాడలో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణి కొర్లపాటిని కలిసి నియోజకవర్గంలోని గృహ నిర్మాణ అవసరాలపై చర్చించారు. గతంలో సాంకేతిక, ఆన్‌లైన్ నమోదు సమస్యలతో గృహాలు నిర్మించుకోలేకపోయిన అర్హులైన లబ్ధిదారులకు మరోసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.