NRML: జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దండేకర్ సాయి, ఉపాధ్యక్షులుగా కృష్ణ, సాయి కృష్ణ, కార్యదర్శిగా శ్రీకాంత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ జి. జానకి షర్మిల నూతన కార్యవర్గాన్ని అభినందించి, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
పోలీస్ సంఘం అధ్యక్షులుగా దండేకర్ సాయి


