ADB: జాతీయ, రాష్ట్ర రహదారులపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని DSP జీవన్ రెడ్డి గురువారం హెచ్చరించారు. రోడ్లను అడ్డుకోవడం వల్ల అత్యవసర సేవలకు అంతరాయం కలిగి ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని అన్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే BNS, నేషనల్ హైవే యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
హైవేలపై రాస్తారోకోలు చేస్తే కఠిన చర్యలు: DSP


