అనకాపల్లి పట్టణం గవరపాలెం నూకాంబిక అమ్మవారి హుండీ ఆదాయం, కానుకలను గురువారం లెక్కించారు. జూన్ 18 నుంచి సెప్టెంబర్ 3 వరకు 77 రోజులకు భక్తులు సమర్పించిన కానుకల్లో నగదు రూ.81,97,691, బంగారం 22.100 గ్రాములు, వెండి 1.130 కిలోలు లభించాయి. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఛైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్, అధికారులు, ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూకాంబిక అమ్మవారి హుండీ లెక్కింపు


