హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్‌ పాలనలో రైతులు దగాపడ్డారు'

NZB: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం తీవ్ర విధ్వంసానికి గురైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. వేల్పూర్ ఎక్స్‌ రోడ్‌ వద్ద గురువారం నిర్వహించిన భారీ ‘రైతు సదస్సు’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.