SDPT: తొగుట మండలం గుడికందుల పాఠశాలలో మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు ముగిసినట్లు మండల విద్యాధికారి నరసయ్య తెలిపారు. కబడ్డీ, కోకో, వాలీబాల్ పోటీలను బుధ, గురువారాలు నిర్వహించినట్లు వివరించారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ బహూకరించారు. హెచ్ఎం అంజిరెడ్డి, సర్పంచ్ కన్నయ్యగారి లక్ష్మి పాల్గొన్నారు.
తెలంగాణ
ముగిసిన మండల స్థాయి క్రీడలు


