హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నదీ కోతకు శాశ్వత అడ్డుకట్ట

కోనసీమ: ఆలమూరు (మం) బడుగువానిలంకలో నదీ కోత నివారణకు రూ.63.83 కోట్లతో గ్రోయిన్స్, రివిట్మెంట్ నిర్మాణ పనులు చేపట్టారు. గతేడాది వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతంలో పటిష్ఠమైన నాలుగు గ్రోయిన్స్‌తో పాటు ధ్వంసమైన రివిట్మెంట్‌ను పునర్నిర్మించారు. గత నెలలో గోదావరి నదికి వచ్చిన వరదల్లో ఈ నిర్మాణాలు చెక్కుచెదరకపోవడంతో రైతులు, గ్రామస్తులు ఊరట చెందారు.