VZM: ఈ నెల 7న జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించనున్న శిక్షణ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ రిహార్సల్స్‌ను ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ గురువారం పరిశీలించారు. కవాతు, ప్లాటూన్ల కదలికలు, మార్చింగ్ తీరును పరిశీలించి సూచనలు చేశారు. కానిస్టేబుళ్లు క్రమశిక్షణ, సమయపాలన, విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పరేడ్‌ను విజయవంతం చేయాలి'


