హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మండపాలకు అనుమతులు తప్పనిసరి'

VZM: ఈ నెల 14న వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలు, పందిళ్లకు తప్పనిసరిగా అనుమతులు పొందాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ గురువారం తెలిపారు. ఉత్సవ కమిటీలు ప్రభుత్వ సింగిల్‌ విండో విధానం ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటుకు ఎలాంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.