హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేశ్ మండపాలకు సరికొత్త రూల్: డీఎస్పీ

W.G: వినాయక చవితి గణేశ్ మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు అనుమతుల ప్రక్రియను పోలీస్ శాఖ సులభతరం చేసింది. www.ganeshutsav.net ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నరసాపురం DSP ఎం. సుధాకర్ రావు తెలిపారు. అనుమతి పొందిన వారికి క్యూఆర్ కోడ్తో కూడిన డిజిటల్ పర్మిషన్ ఇస్తామన్నారు. పోలీస్, ఫైర్, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ శాఖల సమన్వయంతో అనుమతులు ఇస్తామన్నారు.