హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంకల్ప్ ప్రాజెక్టు కింద రిమ్స్ చిన్న పిల్లల విభాగం ఎంపిక

ADB: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'సంకల్ప్' ప్రాజెక్టు కింద ఆదిలాబాద్ రిమ్స్ చిన్న పిల్లల విభాగం ఎంపికైందని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రిమ్స్‌లో పిల్లల వైద్య సేవలు, మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని, జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.