ADB: తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన ప్రేమ్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని నిందితుడు ఎం.డి. రఫీక్ నమ్మించి, గత మే 8న రూ.2 లక్షలు వసూలు చేసినట్లు రూరల్ CI రహీం పాషా గురువారం తెలిపారు. కాలయాపన చేసి, ఫోన్ నంబర్ బ్లాక్ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించారు. ఉద్యోగాల పేరుతో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
ప్రభుత్వ ఉద్యోగం పేరుతో.. కేసు నమోదు


