KMM: నగరంలోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 55లో విధుల్లో ఉన్న బీఎల్‌ఓ లింగరాజుపై స్థానికులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఓటర్‌కు గురువారం విచారణ ఉందని, పోలింగ్ కేంద్రానికి రావాలని ఫోన్ చేశాడు. దీంతో వారు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఇష్టానుసారంగా ఫోన్ చేస్తావా అంటూ అతనిపై దాడి చేసి నోటీసులను విసిరి వేశారు. ఈ విషయంపై లింగరాజు ఖానాపురం హవేలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
బీఎల్‌ఓపై స్థానికుల దాడి


