హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం'

E.G: సీతానగరం (మం) మునికూడలిలో దాత సానిపిన్ని రామారావు సహాయంతో 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు SI ఎల్. శ్రీనివాస్ నాయక్ గురువారం తెలిపారు. నేరాల నియంత్రణకు, నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయన్నారు. సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామంలోనూ దాతలు, నాయకుల సహకారంతో వీటిని ఏర్పాటు చేసుకోవాలని SI సూచించారు.