హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాహుల్ గాంధీ దళిత వ్యతిరేకి కాదు: జగ్గారెడ్డి

SRD: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా నిరసించారు. గురువారం గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పర్యటించిన స్థలాన్ని శుద్ధి చేయడం వెనుక బీజేపీ నేతల కుల వివక్ష, అహంకారపూరిత వైఖరి స్పష్టమవుతోందని విమర్శించారు.