హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మత్స్యకారులకు సంక్షేమ ప్రయోజనాలు అందాలి'

కృష్ణా: మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఢిల్లీలో లోక్‌సభ సబ్‌ఆర్డినేట్ లెజిస్లేషన్ కమిటీ తొలి సమావేశం గురువారం నిర్వహించారు. వరుసగా ఆరోసారి కమిటీ చైర్మన్‌గా నియమితులైన బాలశౌరి.. మత్స్యశాఖ అధికారులతో చట్టాల కింద అమలవుతున్న నిబంధనలను సమీక్షించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రయోజనాలు మత్స్యకారులకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.