హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కౌలు రైతుల బకాయిలు చెల్లించాలి'

కృష్ణా: గన్నవరం మండలం సూరంపల్లిలో కౌలు రైతుల రిలే నిరాహార దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరాయి. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రూ.6.80 లక్షల బకాయిలను వెంటనే చెల్లించాలని కౌలు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం రైతు సేవా కేంద్రం వద్ద వంటా-వార్పు చేపడతామని హెచ్చరించారు.