హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక ఉత్సవాలపై ప్రత్యేక సైబర్ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ

SRPT: గణేష్ నవరాత్రుల సందర్భంగా సైబర్ భద్రతపై అవగాహన కల్పించే ప్రత్యేక పోస్టర్‌ను ఎస్పీ నరసింహ గురువారం ఆవిష్కరించారు. వినాయకుడి రూపం ద్వారా ప్రజలు పాటించాల్సిన సైబర్ జాగ్రత్తలను వివరించారు. ఉత్సవాల వేళ ఫేక్ విరాళాలు, నకిలీ లింకుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని ప్రజలను కోరారు.