హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

MBNR: జిల్లా వ్యాప్తంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.