హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

W.G: చింతలపూడి ప్రోహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్‌లో పనిచేస్తూ ఇటీవలే అకాల మరణం చెందిన కానిస్టేబుల్ పి. వెంకటేశ్వరరావు కుటుంబానికి తోటి ఉద్యోగులు అండగా నిలిచారు. ఉమ్మడి జిల్లాల ఎక్సైజ్ సిబ్బంది విరాళంగా సేకరించిన రూ.2,43,000 ఆర్థిక సాయాన్ని గురువారం తణుకులో కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.