హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా క్రీడలు.. కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

జపాన్ వేదికగా మరో రెండు వారాల్లో ప్రారంభంకానున్న ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది. అదే సమయంలో భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ ఉండటంతో, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో లక్ష్మణ్ ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. టీమ్‌ఇండియా నేరుగా క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది.