హైదరాబాద్: 28°C
క్రీడలు

టామ్ కర్రాన్ హ్యాట్రిక్.. టోర్నీలో ఇదే తొలిసారి

యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో ఇంగ్లండ్ పేసర్‌ టామ్ కర్రాన్ హ్యాట్రిక్‌తో మెరిశాడు. బెల్‌ఫాస్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎడిన్‌బర్గ్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ఎడిన్‌బర్గ్ 189 పరుగులు చేయగా.. టామ్ కర్రాన్ అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని 130 పరుగులకే కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్ ద్వారా టోర్నీలో తొలి హ్యాట్రిక్ నమోదైంది.