హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రహదారి సౌకర్యం కల్పించాలి'

ASR: డుంబ్రిగూడ మండలంలోని కితలంగి పంచాయతీ పరిశీల జంక్షన్‌ నుంచి పాములపుట్టు గ్రామం వరకు సుమారు కిలోమీటరు మేర రహదారి నిర్మించాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం పాములపుట్టులో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పొద్దు బాలదేవ్‌, సూర్యనారాయణ మాట్లాడారు. రహదారి లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.