MDK: మెదక్‌లో రైస్ మిల్లర్ల సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. మిల్లులపై జరుగుతున్న దాడులతో తీవ్రంగా నష్టపోతున్నామని జిల్లా అధ్యక్షులు చంద్రపాల్, వీరేశం ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు డిఫాల్టర్ల కారణంగా అందరినీ అనుమానించడం సరికాదన్నారు. విద్యుత్, హమాలీ, యంత్రాలు ఖర్చులు పెరిగాయని, ప్రభుత్వం సహకరించాలని కోరారు. దాడులు ఆపకపోతే ఆందోళన చేపడతామన్నారు.
తెలంగాణ
రైస్ మిల్లులపై దాడులు ఆపాలి: మిల్లర్ల సంఘం


