SRPT: కోదాడ మున్సిపాలిటీ అకౌంట్స్ సెక్షన్‌లో ఉ: 11 గంటల సమయంలోనూ పలు కుర్చీలు ఖాళీగా కనిపించడం చర్చనీయాంశంగా మారింది. పనుల కోసం వచ్చిన ప్రజలకు సిబ్బంది అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు తెలిపారు. కార్యాలయ సమయపాలనపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రజలకు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
కోదాడ మున్సిపాలిటీలో ఖాళీ కుర్చీలు


