BDK: మణుగూరు మండలం గుట్టమల్లారంలో గురువారం జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు కంది పొలాలను పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం, నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే కంది పంటను సాగు చేయాలని రైతులకు సూచించారు. కంది సాగు విధానం, పంట యాజమాన్యం, తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
ఎల్‌నినో ప్రభావంతో కంది సాగు


