JGL: తెలంగాణలో 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.14 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కథలాపూర్ తహసీల్దార్ రమేశ్‌కు ధర్మ సమాజ్ పార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుంకపాక కోటేష్ మహారాజ్, నర్సయ్య, మల్లేశం పాల్గొన్నారు.
తెలంగాణ
'బకాయిలు చెల్లించాలని వినతి'


