హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంటల ప్రణాళికపై అవగాహన సదస్సు

VZM: మెరకముడిదాం ఎంపీడీవో మీటింగ్ హాల్‌లో గురువారం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి అహమ్మద్ గౌస్ మాట్లాడుతూ.. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా రైతులందరూ మొక్కజొన్న, రాగులు, మినుములు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు