హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శ్రీకృష్ణ జయంతి వేడుకలకు ఏర్పాట్లు'

NLR: నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవో ఆళ్ల శ్రీనివాస రెడ్డి తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు తిరుమంజనం, 5.30 గంటలకు కృష్ణ అవతార పురాణ పఠనం, సేవాకాలం, శాత్తుమురై అనంతరం రాత్రి 7.30 గంటలకు తూర్పు రాజగోపురంలో ఊంజల్ సేవ, గోపురోత్సవం జరుగుతాయన్నారు.