హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్వరోగ నివారిణి యునాని వైద్యం: డా.అబ్దుర్ రజాక్

NLR: ప్రాచీన వైద్య విధానమైన యునాని వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మహిమలూరు యునాని వైద్య శాల వైద్యుడు డాక్టర్ అబ్దుర్ రజాక్ తెలిపారు. పలు దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఇబ్బందికరమైన ఆరోగ్య సమస్యలకు యునాని వైద్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధీనంలో అందుబాటులో ఉన్న ఈ ఉచిత యునాని వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.