హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

PDPL: జిల్లా కేంద్రంలో నూతన బస్సు డిపో నిర్మాణం, టాస్క్ కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న మరమ్మత్తు పనులను కలెక్టర్ శ్రీ హర్ష ఈరోజు పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. టాస్క్ కేంద్రంలో ఈనెల 8 నుంచి నూతన బ్యాచ్ ప్రారంభించాలని తెలిపారు. ఏఐఎంఎల్ తదితర కోర్సులలో శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.