హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి'

PDPL: కమాన్పూర్ మండలం పేరపల్లి గ్రామంలో చేపడుతున్న ఇంకుడు గుంతల నిర్మాణాలను కేంద్ర బృందం ప్రతినిధులు గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాలు, నిర్వహణ తీరుపై బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ విధిగా ఇంకుడు గుంతలు నిర్మించుకొని భూగర్భ జలాల పెంపునకు సహకరించాలని అధికారులు తెలిపారు.