హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొక్కజొన్న చేనుపై అడవి పందుల బీభత్సం

ADB: బజారాత్నూర్ గ్రామ రైతు తాండ్ర సంతోశ్ మొక్కజొన్న చేసుపై అడవి పందులు విరుచుకుపడ్డాయి. రాత్రివేళల్లో గుంపులుగా వచ్చిన పందులు చేనంతా తొక్కి, మొక్కలను విరిచేసి పంటను ధ్వంసం చేశాయి. అప్పులు చేసి, ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ఇలా నాశనం కావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.