హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోసానిపేట్ మీదుగా అన్నారానికి ఆర్టీసీ బస్సు

కామారెడ్డి–అన్నారం ఆర్టీసీ బస్సును పోసానిపేట్ మీదుగా నడిపించేందుకు అధికారులు సానుకూలంగా స్పందించారు. గురువారం కొత్త రూట్‌లో బస్సు సర్వీసును ప్రారంభించారు. మధ్యాహ్నం 11:45 గంటలకు కామారెడ్డి నుంచి బయలుదేరి పోసానిపేట్ మీదుగా అన్నారం వెళ్లి, తిరిగి అదే మార్గంలో కామారెడ్డికి చేరుకుంటుంది. బస్సుకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినట్లు సర్పంచ్ తెలిపారు.