విశాఖ రైల్వే క్వార్టర్స్‌లో నివాసముంటున్న ఇద్దరు మహిళలు ఆటో ఎక్కి బ్యాంకు పని నిమిత్తం డాబాగార్డెన్స్‌లోని కెనరా బ్యాంకు వద్ద దిగారు. అయితే, వారు తమతో తెచ్చుకున్న బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు. ఆ బ్యాగును గమనించిన ఆటో డ్రైవర్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా డ్రైవర్ నిజాయితీని పోలీసులు, బాధితులు ప్రత్యేకంగా అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్


