కరీంనగర్ జిల్లా రేకుర్తి పరిధిలోని పట్టా భూములను 22-A నిషేధిత జాబితాలోకి చేర్చడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. దశాబ్దాలుగా ఇళ్లు కట్టుకున్న స్థలాలు, వ్యవసాయ భూములను ఈ జాబితాలో పెట్టడంపై నేతలు మండిపడ్డారు. దీనివల్ల రైతులకు రుణాలు అందడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణ
రేకుర్తిలో బీఆర్‌ఎస్ ధర్నా


