హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజయశాంతికి మంత్రి పదవి..?

WGL: మంత్రి కొండా సురేఖ వ్యవహారం నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సురేఖను తప్పిస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం కల్పించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో MLC విజయశాంతి, విజయలక్ష్మి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.