హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీజీటల్ పంట సర్వేను పరిశీలించిన కలెక్టర్

WGL: సంగెం(M) రామచంద్రాపురంలో పంట పొలాల్లో కొనసాగుతున్న డీజీటల్ సర్వేను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పరిశీలించారు. సర్వే విధానం, భూముల వివరాల నమోదు తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎలాంటి తప్పులు లేకుండా కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.