హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలకు శుద్ధమైన నీటిని సరఫరా చేయాలి'

ATP: గుంతకల్ మున్సిపాలిటీలోని తాగునీటి శుద్ధి కేంద్రాన్ని గురువారం మున్సిపాలిటీ అధికారులు పరిశీలించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ.. నీటి శుద్ధి ప్రక్రియలో ఎక్కడా లోపాలు లేకుండా నాణ్యత ప్రమాణాలను పాటించాలని, నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో నీటి సరఫరా సమయాలను సమీక్షించాలన్నారు.