హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాంగ్రెస్‌లో అంతా అవినీతే: రాజాసింగ్ 

HYD: కాంగ్రెస్‌లో అవినీతి కూరుకుపోయిందని, ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియక ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. మంత్రులు, పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా అవినీతే నడుస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అవినీతి పెరిగిందన్నారు. డబ్బుల వాటాల వ్యవహారమే చివరకు మంత్రి కొండా సురేఖ రాజీనామా వరకు వెళ్లిందని ఆయన వ్యాఖ్యానించారు