హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలి'

VKB: రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని వికారాబాద్ మున్సిపల్ కార్మికులు గురువారం తమ విధులను బహిష్కరించి BJR చౌరస్తాలో నిరసన చేపట్టారు. కార్మికులు మాట్లాడుతూ.. ఏసీ గదుల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్న ప్రభుత్వం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్మికుల జీతాలు చెల్లించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు.