హైదరాబాద్: 28°C
వ్యాపారం

స్విగ్గీ-హీరో మోటోకార్ప్‌ ఒప్పందం

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ.. హీరో మోటోకార్ప్‌తో ఒప్పందం చేసుకుంది. డెలివరీ భాగస్వాములకు ప్రత్యేక ధరలకు ద్విచక్ర వాహనాలు అందించేందుకు ఈ డీల్ కుదుర్చుకుంది. దీంతో హీరో మోటోకార్ప్‌కి చెందిన అన్ని రకాల బైక్స్‌పై స్విగ్గీ రైడర్లకు ప్రత్యేక తగ్గింపు ధరలు లభిస్తాయి. స్విగ్గీ యాప్‌లోనే నచ్చిన హీరో బైక్ మోడల్‌ను డెలివరీ భాగస్వాములు ఎంపిక చేసుకోవచ్చు.