హైదరాబాద్: 28°C
తెలంగాణ

PACS భవనం ముందు BRS నిరసన

SRCL: ఎల్లారెడ్డిపేట రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ BRS నాయకులు, కార్యకర్తలు, రైతులు నిరసన చేపట్టారు. KTR పిలుపు మేరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) భవనం ఎదుట ఆందోళన నిర్వహించారు. 1000 రోజుల పాలన రైతులకు నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.