ఖమ్మం రూరల్ మండలం తీర్ధాల గ్రామపంచాయతీ 8వ వార్డు ప్లాట్ కాలనీలో ఓ విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉందని స్థానికులు తెలిపారు. విద్యుత్ స్తంభం కింద భాగంలో విరిగి ఒక పక్కకు వంగి ఉందని చెప్పారు. ప్రమాదవశాత్తు ఈ విద్యుత్ స్తంభం విరిగిపడితే అనుకోని ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించాలి'


